
న్యూఢిల్లీ: దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన వాహన ధరలను రూ.625 వరకు పెంచింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో బైక్స్, స్కూటర్ల ధరలను తక్షణం పెంచినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్, మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు ఉంటుందని పేర్కొంది.
కాగా హీరో మోటోకార్ప్ రూ.40,000– రూ.1,00,000 ధరల శ్రేణిలో వాహనాలను మార్కెట్‌లో విక్రయిస్తోంది.