
హార్లే డేవిడ్సన్.. కొత్త ‘స్ట్రీట్ రాడ్’@రూ. 5.86 లక్షలు
అమెరికా బైక్‌ల కంపెనీ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ మోడల్లో కొత్త వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.
ముంబై: అమెరికా బైక్‌ల కంపెనీ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ మోడల్లో కొత్త వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.5.86 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). పెరుగుతున్న యువత లక్ష్యంగా ఈ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని హార్లే డేవిడ్సన్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) పల్లవి సింగ్ చెప్పారు.
750 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ బైక్‌లో స్లి్పట్ సీట్ డిజైన్, ముందు భాగంలో కొత్త విండ్‌స్క్రీన్, వెనుక భాగంలో కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడీ లైట్స్, ఫోల్డ్ చేసుకునే వీలున్న రియర్ వ్యూ మిర్రర్స్, 17 అంగుళాల అలాయ్ వీల్స్,, ముందు, వెనుక భాగాల్లో 300 ఎంఎం డిస్క్ బ్రేకులు తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.