20న జీఎస్‌టీ మండలి సమావేశం

GST Meeting in Goa - Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వచ్చే శుక్రవారం (20వ తేదీన) గోవాలో జరగనుంది. కార్ల నుంచి బిస్కెట్ల వరకూ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని వస్తున్న డిమాండ్లపై ఈ అత్యున్నత స్థాయి జీఎస్‌టీ సమావేశం దృష్టి సారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యక్షంగా ఎటువంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని మండలి సమీక్షిస్తుందని తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆరి్థక మందగమనం, ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో జీఎస్‌టీ తగ్గింపునకు సంబంధిత వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top