ఎయిర్‌ ఇండియా ‘ఎస్‌పీవీ’!

Government plans to transfer Air India's non-core assets to SPV - Sakshi

ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం  

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు సంబంధించిన కీలకం కాని ఆస్తులను, రుణ భారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కంపెనీ(స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌–ఎస్‌పీవీ) బదలాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌ ఇండియా పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు.

ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం విఫలం కావడంతో ఎయిర్‌ ఇండియాను గట్టెక్కించే యత్నాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. దాంట్లో భాగంగానే ఎస్‌పీవీ ఏర్పాటు విషయమై కసరత్తు చేస్తోంది. కాగా గత ఏడాది మార్చి నాటికి ఎయిర్‌ ఇండియా రుణ భారం రూ.48,000 కోట్లకు మించిపోయింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top