అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌ ‘గూగుల్‌’ | Google most authentic brand in India: Report | Sakshi
Sakshi News home page

అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌ ‘గూగుల్‌’

Oct 21 2017 1:31 AM | Updated on Oct 21 2017 4:00 AM

Google most authentic brand in India: Report

ముంబై: భారత్‌లో అత్యంత నమ్మకమైన బ్రాండ్‌ ఏదో తెలుసా? ఏ బ్రాండ్‌ అయ్యింటుందని ఆలోచిస్తున్నారా? ఆగండి.. నేనే చెప్పేస్తాను. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్‌.. దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్‌ ఉన్నాయి.

గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ‘కొహ్న్‌ – వోల్ఫ్‌’ ఈ విషయాలను వెల్లడించింది. సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ బెంజ్, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వంటి బ్రాండ్స్‌ టాప్‌–10లో స్థానం పొందాయి. దాదాపు 67 శాతం మంది భారతీయ కన్సూమర్లు వారి కొనుగోళ్లలో బ్రాండ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెజాన్‌ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది. దీని తర్వాతి స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement