కోట్లాది కాల్ సెంటర్‌ ఉద్యోగాలు గోవిందా..??

Is Google Duplex AI Assistan A Threat To Call Center Jobs? - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : గూగుల్‌ సరికొత్త ఆవిష్కరణ కోట్లాది మంది ఉద్యోగుల పొట్టకొట్టనుందా?. ఈ ఏడాది జరిగిన డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో గూగుల్‌ ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’ సాంకేతికతను పరిచయం చేసింది. దీని ద్వారా వినియోగదారులు అపాయింట్‌మెంట్లను, రిజర్వేషన్లను చేసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

అయితే, గూగుల్‌ డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా కాల్‌ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగుల పొట్టకొట్టబోతోందని రిపోర్టు ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డూప్లెక్స్‌ ఏఐ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించొచ్చని, అచ్చం మనుషుల్లా మాట్లాడుతూ ఈ టెక్నాలజీ యూజర్లు సంతృప్తి పరుస్తుందని సమాచారం.

ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్‌ కంపెనీలు డూప్లెక్స్‌ను వారి వారి అప్లికేషన్స్‌కు ఎలా అన్వయించాలా అన్నదానిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా డూప్లెక్స్‌ ద్వారా కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలకు ఎసరు వస్తుందనే రిపోర్టులను గూగుల్‌ ఖండించింది. కేవలం అపాయింట్‌మెంట్స్‌, బుకింగ్స​ తదితర అవసరాలకు మాత్రమే డూప్లెక్స్‌ ఉపయోగపడుతుందని తేల్చి చెప్పింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top