ఇప్పటికీ ‘పసిడి’ బలహీనమే!

Gold is weak in September - Sakshi

నైమెక్స్‌లో వరుసగా ఆరవనెలా సెప్టెంబర్‌లోనూ పసిడి బలహీనంగానే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు, డాలర్‌ పటిష్ట ధోరణి దీనికి నేపథ్యం. ఆరు నెలల్లో డాలర్‌ ఇప్పటి వరకూ దాదాపు 12 శాతం తగ్గింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి మరోసారి ఆగస్టు కనిష్ట స్థాయి (1,160 డాలర్లు) తాకే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఎగువ స్థాయిలో 1,216, 1,236 డాలర్లు నిరోధ స్థాయిలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే భారత్‌ విషయానికి వచ్చే సరికి దేశంలో పెద్దగా ధర తగ్గే అవకాశం లేదన్నది వారి వాదన. డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణం. ఇక వారంలో నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర 9 డాలర్లు తగ్గి, 1,196 డాలర్లకు పడింది. డాలర్‌ ఇండెక్స్‌ డాలర్‌ పెరుగుదలతో 94.80కి చేరింది. ఎంసీఎక్స్‌లో ధర వారంలో కేవలం రూ.74 తగ్గి రూ.30,508కి చేరింది. 99.9, 99.5 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.390 చొప్పున తగ్గి, రూ.30,450, రూ.30,300 వద్ద ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top