
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
ముంబై : రోజుకో రకంగా హెచ్చుతగ్గులతో కదులుతున్న బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలతో పసిడి ధర పరుగులు పెట్టింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 209 భారమై రూ 40,559కు ఎగబాకింది. మరోవైపు వెండి ధర సైతం కిలోకు రూ 367ప పెరిగి రూ 45,918కి చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు నిలకడగా పైపైకి ఎగబాకుతాయని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనం, అనిశ్చితితో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్నే ఎంచుకోవడంతో యల్లోమెటల్ మరింత తళుకులీనుతుందని వారు చెబుతున్నారు.