రెండో రోజు తగ్గిన బంగారం ధర | Gold Prices Extend Losses To Second Day | Sakshi
Sakshi News home page

రెండో రోజు తగ్గిన బంగారం ధర

Jun 12 2018 4:22 PM | Updated on Jun 12 2018 8:32 PM

Gold Prices Extend Losses To Second Day - Sakshi

బంగారం ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు బంగారం ధరలు కిందకి దిగొచ్చాయి. నేటి ట్రేడింగ్‌లో మరో 150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా కిందకి పడుతున్నాయి. అయితే బంగారం కిందకి దిగొస్తుంటే, వెండి మాత్రం పైకి వెళ్తోంది. కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా రికార్డయింది. అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సానుకూల ధోరణిలో ఉండటంతో, డాలర్‌ బలపడుతోంది. యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్‌ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో గ్లోబల్‌గా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి.

మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ బంగారాన్ని దెబ్బకొడుతున్నాయి. ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 150 రూపాయలు పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.31,800, రూ.31,650 చొప్పున పెరిగింది. సోమవారం కూడా ఈ ధరలు 100 రూపాయలు తగ్గాయి. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.19 శాతం తగ్గి ఔన్స్‌కు 1,297.50 డాలర్లుగా నమోదైంది. గత కొన్ని వారాల నుంచి బంగారం ధరలు రూ.32,500 నుంచి రూ.31,400 రేంజ్‌లో నడుస్తున్నాయని, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్‌ సంకేతాలు వస్తుండటంతో ధరలు తగ్గుతున్నట్టు ఏబ్యాన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల చైర్మన్‌, వ్యవస్థాపకుడు అభిషేక్‌ బన్సాల్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement