భారీగా పెరిగిన బంగారం ధర | gold price increases suddenly | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన బంగారం ధర

Dec 2 2014 5:38 PM | Updated on Aug 2 2018 3:54 PM

భారీగా పెరిగిన బంగారం ధర - Sakshi

భారీగా పెరిగిన బంగారం ధర

గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పడుతూ.. వినియోగదారులను ఊరిస్తున్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది.

గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పడుతూ.. వినియోగదారులను ఊరిస్తున్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర 840 రూపాయలు పెరిగింది. పది గ్రాముల ధర ప్రస్తుతం 27,040 రూపాయలుగా ఉంది.

ఈ ఏడాది ఒకే రోజులో ఇంత రేటు పెరగడం ఇదే మొదటి సారి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో ఈమధ్య కాలంలో బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ధర పెరగడంతో ఒక్కసారిగా వినియోగదారులు కుదేలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement