రూ. 736కే విమానం టికెట్ | Go Air offers 736 inclusive of all air tickets | Sakshi
Sakshi News home page

రూ. 736కే విమానం టికెట్

Nov 23 2016 7:31 PM | Updated on Sep 27 2018 9:08 PM

రూ. 736కే విమానం టికెట్ - Sakshi

రూ. 736కే విమానం టికెట్

విమాన ప్రయాణాలు తగ్గిన నేపథ్యంలో.. మరో విమానయాన సంస్థ కూడా చౌక టికెట్లను ప్రకటించింది.

విమాన ప్రయాణాలు తగ్గిన నేపథ్యంలో.. మరో విమానయాన సంస్థ కూడా చౌక టికెట్లను ప్రకటించింది. 2017 జనవరి 9వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు పన్నులన్నింటితో కలిపి కేవలం రూ. 736 చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. అయితే ఈ టికెట్లను ఈనెల 24వ తేదీ (గురువారం)లోపు బుక్ చేసుకోవాలి. గో ఎయిర్ నెట్‌వర్కులు అన్నింటిలోనూ.. అంటే, గో ఎయిర్ వెబ్‌సైట్, టికెటింగ్ కౌంటర్లు, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లన్నింటికీ ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. 
 
అయితే, గ్రూప్ డిస్కౌంటులు, ఇన్‌ఫాంట్ బుకింగ్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న మరే ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో కలిపి దీన్ని వాడటానికి వీలుండదు. ప్రామాణిక రద్దు, రీబుకింగ్ విధానాలకు అనుగుణంగా ధరలుంటాయి. మరోవైపు.. గురువారం అర్ధరాత్రి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను తమ టికెటింగ్ కౌంటర్లలో అనుమతిస్తామని కూడా గో ఎయిర్ ప్రకటించింది. అయితే, ఈ నోట్లతో బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి గానీ, మార్చుకోడానికి గానీ కుదరదని చెప్పింది. 

Advertisement
 
Advertisement
Advertisement