శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు | GHIAL launches innovative service at RGIA | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు

Feb 4 2016 10:00 AM | Updated on Aug 9 2018 7:30 PM

శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు - Sakshi

శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులకు సినిమాల విందు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులకు సినిమాల విందు. ప్రయాణికులు తమకు నచ్చిన సినిమాలు, టీవీ షోలు, వీడియోలను ఉచితంగా, అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అయిన ఫ్రాప్‌కార్న్‌తో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) చేతులు కలిపింది.

ఫ్రాప్‌కార్న్ యాప్ ద్వారా ఒక సినిమా 3 నిముషాల లోపే డౌన్‌లోడ్ అయ్యేలా వేగంగా పనిచేసే వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేశారు. భారత్‌లో డిమాండ్‌పై వినోద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి విమానాశ్రయంగా జీహెచ్‌ఐఏఎల్ నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement