ఏడాదిలో 250 జియోనీ బ్రాండ్ స్టోర్లు | Geonee-brand stores in the year 250 | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 250 జియోనీ బ్రాండ్ స్టోర్లు

Jul 1 2015 12:33 AM | Updated on Sep 3 2017 4:38 AM

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ భారత్‌లో ఏడాదిలోగా బ్రాండ్ స్టోర్ల సంఖ్యను 250కి చేర్చనుంది...

కంపెనీ ఎండీ అరవింద్ వోరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ భారత్‌లో ఏడాదిలోగా బ్రాండ్ స్టోర్ల సంఖ్యను  250కి చేర్చనుంది. ప్రస్తుతం 22 బ్రాండ్ స్టోర్లు ఉన్నాయని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజ్‌నీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 45,000పైగా  రిటైల్ స్టోర్లలో జియోనీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ప్రముఖ రిటైల్ చైన్ సంస్థలతో చేతులు కలిపామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement