ప్రీమియం ఏడాదికే... కవరేజీ రెండేళ్లు!

General Innovation is an innovative add-on feature - Sakshi

హైదరాబాద్‌: ఎడెల్‌వీజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఓ వినూత్నమైన యాడ్‌ ఆన్‌ ఫీచర్‌  ‘హెల్త్‌ 241’ని ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి కొత్తగా వైద్య బీమా పాలసీ తీసుకునే వారు, ఈ యాడ్‌ ఆన్‌ను జోడించుకోవచ్చు. దీని వల్ల మొదటి ఏడాది పాలసీ కాల వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌ లేకపోతే మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం చెల్లించక్కర్లేదు. రెండో ఏడాది పూర్తి ఉచితంగా వైద్య బీమా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి బీమా సంస్థ ఇదే.

‘‘మన దేశంలో బీమాను ఇప్పటికీ అదనపు వ్యయంగానే చూస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు తాము ఆరోగ్యవంతులమని, క్లెయిమ్‌ అవసరం పడదు కనుక బీమా పాలసీ అక్కర్లేదనే భావనలో ఉన్నారు. ఈ తరహా కస్టమర్లకు హెల్త్‌ 241 యాడ్‌ ఆన్‌ విలువను అందిస్తుంది. మొదటి ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌ లేకపోతే, రెండో ఏడాది కూడా మాతోనే కొనసాగుతారు’’అని ఎడెల్‌వీజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో అనూప్‌ తెలిపారు. ఇక రీస్టోరేషన్, క్లెయిమ్‌ లేకపోతే తదుపరి ఏడాది బీమా మొత్తాన్ని 100 శాతం వరకు పెంచుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top