ఒక్కో వ్యక్తి కోసం 1.48 లక్షల ఉద్యోగాలు
ప్రపంచంలో అదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. కానీ అక్కడ పనిచేయడానికి వర్కర్లే లేరట.
ప్రపంచంలో అదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. కానీ అక్కడ పనిచేయడానికి వర్కర్లే లేరట. వర్కర్లు దొరకకపోవడంతో అక్కడ ఒక్కో ఉద్యోగి కోసం భారీ ఎత్తున్న జాబ్స్ ఎదురుచూస్తున్నాయట. ఉద్యోగి కోసం ఉద్యోగాలు ఎదురుచూసే పరిస్థితి ఎక్కడ నెలకొందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేనండి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, ఆధునిక జీవనశైలికి పెట్టింది పేరుగా ఉంటున్న జపాన్ దేశంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రభుత్వ డేటా ప్రకారం ఒక్కో దరఖాస్తుదారునికి 1.48 లక్షలు ఉద్యోగాలున్నాయని తెలిసింది. మార్చిలో 1.45 ఉద్యోగాలుంటే వాటి సంఖ్య ఏప్రిల్ లో మరింత పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. అంటే ఉద్యోగం కోసం ఎదురుచూసే ప్రతి 100 మందికి 148 ఉద్యోగాలున్నాయన్నమాట. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత శ్రామిక కొరతను జపాన్ చవి చూస్తుందని తెలిసింది. అక్కడ నిరుద్యోగిత రేటు స్థిరంగా 2.8 శాతం వద్దనే ఉందని, జూన్ 1994 నాటి కనిష్టస్థాయిలోనే ఉందని వెల్లడైంది.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వృద్ధి కూడా శరవేగంగా పెరిగింది. ప్రైవేట్ వినియోగత్వం పెరగడం, దీనికి తోడు మంచి ఎగుమతులు నమోదుకావడం ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే దేశీయంగా వినియోగదారుల వ్యయాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. 2015 తర్వాత మొదటిసారి జపాన్ బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్ సూచీ నిక్కీ కూడా 20వేల పాయింట్ మార్కును చేధించింది. అంతకంతకు పెరుగుతున్న శ్రామిక కొరత వేతనాల పెంపుకు దోహదం చేస్తుందని ఆర్థికవేత్తలంటున్నారు. దీంతో ధరల వృద్ధి కూడా టార్గెట్ గా పెట్టుకున్న 2 శాతాన్ని తాకుతుందని జపాన్ సెంట్రల్ బ్యాంకు అంచనావేస్తోంది.