స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్‌ ఇవే... | Flipkart Big Billion Days Sale: Samsung, Micromax, Infinix Offer Discounts on Budget Smartphones | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్‌ ఇవే...

Sep 16 2017 4:52 PM | Updated on Aug 1 2018 3:40 PM

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్‌ ఇవే... - Sakshi

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్‌ ఇవే...

ఫ్లిప్‌కార్ట్‌ తన వార్షిక బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు త్వరలోనే తెరతీయబోతుంది. పండుగ సీజన్‌కు కానుకగా సెప్టెంబర్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతుంది.

ఫ్లిప్‌కార్ట్‌ తన వార్షిక బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు త్వరలోనే తెరతీయబోతుంది. పండుగ సీజన్‌కు కానుకగా సెప్టెంబర్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతుంది. సెప్టెంబర్‌21 నుంచి స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను కూడా ప్రారంభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. మోటో, శాంసంగ్‌, షోలో, స్వైప్‌, ఆసుస్‌, మైక్రోమ్యాక్స్‌, శాన్‌సుయి, ఐవోమి వంటి బ్రాండ్లపై డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు...
ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 4 ప్రొపై 1000 రూపాయల డిస్కౌంట్‌.. ధర రూ.6,499.
6,499 రూపాయలు గల పానసోనిక్‌ పీ85 ఫోన్‌ రూ.4,999కే అందుబాటు
స్వైప్‌ ఎలైట్‌ సెన్స్‌ అసలు ధర 7,499 రూపాయలు, అందుబాటులో ఉండే ధర రూ.5,999.
షోలో ఎరా 1ఎక్స్‌పై 1000 రూపాయల డిస్కౌంట్‌, అందుబాటులో ఉండే ధర రూ.3,999.
యునిక్యూ 2పై 500 రూపాయల డిస్కౌంట్‌... ధర రూ.5,499.
 
7000వేల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్‌ కూడా ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌5, శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7, శాంసంగ్‌ గెలాక్సీ జే3 ప్రొలపై డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. ధరల తగ్గింపుతో పాటు అదనంగా ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేయనుంది. ఎంపికచేసిన మోడల్స్‌పై ఎక్స్చేంజ్‌ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement