కరోనా క్రాష్‌ : రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

Equity Market Crumbled On Monday As Stocks Across The Board - Sakshi

ముంబై : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది. ఓ దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పదిశాతంపైగా పతనమవడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందనే ఆందోళనతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3934 పాయింట్ల నష్టంతో 25,981 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1136 పాయింట్లు పతనమై 7610 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో కీలక సూచీలు ఈ స్ధాయిలో పతనమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం​. స్టాక్‌మార్కెట్లు పాతాళానికి దిగజారడంతో ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరవగా, గత నెలలో ఇన్వెస్టర్లు రూ 56.22 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

చదవండి : 12 ఏళ్లలో మొదటిసారి...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top