కేశ సంరక్షణ రంగంలోకి డాక్టర్ రెడ్డీస్ | Dr. Reddy's into hair care sector | Sakshi
Sakshi News home page

కేశ సంరక్షణ రంగంలోకి డాక్టర్ రెడ్డీస్

Sep 5 2015 12:25 AM | Updated on Sep 3 2017 8:44 AM

కేశ సంరక్షణ రంగంలోకి డాక్టర్ రెడ్డీస్

కేశ సంరక్షణ రంగంలోకి డాక్టర్ రెడ్డీస్

డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కేశ సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కేశ సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. రాలుతున్న జుట్టును అరికట్టే ‘మిన్‌టాప్ ప్రో’ ప్రోక్యాపిల్’ హెయిర్ థెరిపీని మార్కెట్లోకి విడుదల చేసింది. 75ఎంఎల్ మిన్‌టాప్ ప్రో బాటిల్ ధరను రూ. 995గా నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా అమెరికా మార్కెట్ నుంచి అమ్లోడైపిన్ బెస్‌లేట్, అటర్వాస్టాటిన్ కాల్షియం ట్యాబ్లెట్లకు సంబంధించిన 55,000 బాటిల్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement