చెదరకుండా! | Tips for healthy hair | Sakshi
Sakshi News home page

చెదరకుండా!

Jun 13 2026 5:58 AM | Updated on Jun 13 2026 5:58 AM

Tips for healthy hair

జుట్టు జిడ్డుగా, రింగులు తిరిగి చెదరిపోవడం అనేది ఒక పెద్ద సమస్య. అలా చెదరకుండా కాపాడుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు.
జుట్టు చెదరడాన్ని అడ్డుకోవడానికి కార్బోనేటెడ్‌ వాటర్‌ అత్యంత సులభమైన మార్గం. షాంపూ చేసుకున్న తర్వాత, క్లబ్‌ సోడా, సోడా వాటర్‌తో జుట్టును చివరగా ఒకసారి కడగాలి. కార్బోనేటెడ్‌ వాటర్‌లో పీహెచ్‌ స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఇది జుట్టు చెదరడాన్ని తగ్గిస్తుంది. 

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి జుట్టు చెదరడాన్ని అదుపు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది జుట్టుకు మంచి మెరుపును ఇస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను నీటితో కలిపి షాంపూ చేసిన తర్వాత జుట్టును కడగాలి. 

కొబ్బరిలో జుట్టుకు మేలు చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి పాలను తీసుకుని, ఎక్కువ వేడి కాకుండా గోరువెచ్చగా చేయాలి. దీనిని జుట్టుకు అప్లై చేసి, వేడి టవల్‌ లేదా షవర్‌ క్యాప్‌తో కప్పుకొని రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే మైల్డ్‌ షాంపూ, కండిషనర్‌తో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement