కత్రినా కైఫ్ పొడవాటి ఒత్తైన జుట్టు రహస్యం...! | beauty Tips: Katrina Kaifs Haircare Secret | Sakshi
Sakshi News home page

Katrina Kaif: కత్రినా కైఫ్ పొడవాటి ఒత్తైన జుట్టు రహస్యం...!

Jun 3 2026 5:24 PM | Updated on Jun 3 2026 5:51 PM

beauty Tips: Katrina Kaifs Haircare Secret

బాలీవుడ్‌ నటి, కత్రినా కైఫ్‌ ఇటీవల తన పొడవైన, ఒత్తైన మెరిసే జుట్టుకి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్‌ చేశారు. నటుడు విక్కీ కౌశల్‌ పుట్టిన రోజు వేడుకుల నిమిత్తం వెళ్లిన టూర్‌ ఫోటోలు. అందులో కొన్ని అందమైన కుటుంబ క్షణాల తోపాటు ఆమె ఆకర్షణీయమైన కురుల ఫోటోలు అందర్నీ మత్రముగ్ధుల్ని చేశాయి. కానీ ఆమె అభిమానుల్లో ఒకటే చర్చ మొదలైంది కత్రినాకు ఇంత ఒత్తైన మెరిసే జుట్టు ఉందా అని. ఈ కురులు ఎంత ఆకర్షణగా నిలిచాయంటే మా హెయిర్‌ కూడా ఇలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరు అంటూ పోస్టులు వెల్లువెత్తేలా చర్చనీయాంశమైంది. 

అయితే తన పొడవైన జుట్టు రహస్యం ఖరీదైన సెలూన్ ట్రీట్‌మెంట్ లేదా విలాసవంతమైన హెయిర్ ప్రొడక్ట్ కాదని, తన అత్తగారు వీణా కౌశల్‌ ఇంట్లో తయారు చేసిన హెయిర్‌ ఆయిల్‌ అని కత్రినానే స్వయంగా వెల్లడించారు. మరి ఆ ఆయిల్‌ ఏంటో దాని వివరాలు గురించి తెలుసుకుందామా..!.

తన అత్తగారు ఉ‍ల్లిపాయ, ఉసిరి, అకవాడోతోపాటు మరికొన్ని పోషకపదార్థాలతో నూనెను తయారు చేస్తారని అన్నారు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసే ముందుకు చాలా గంటలపాటు మరిగిస్తారని అన్నారు. తాను వాడుతున్న నూనె అత్యద్భుతమైనదని అన్నారు. ఫ్యానీ ఫ్యాషన్‌ కంటే స్థిరమైన దినచర్యే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారామె.

కత్రినా ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్‌ ప్రయోజనాలు ఇవే..

  • ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేయడానికి, తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాంప్రదాయ కేశ సంరక్షణ పద్ధతిగా చెప్పొచ్చు. 

  • ఉల్లిపాయ రసం జుట్టు చిన్న వయసులోనే నెరసిపోవడాన్ని తగ్గించి, చుండ్రును నివారిస్తుంది

  • మరోవైపు, అవకాడోలో ఉండే సహజ నూనెలు, పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ఇది జుట్టుకు లోతైన పోషణను అందించి, తేమను చేకూరుస్తుంది.

ఈ పోషకాలు అన్ని రకాల జుట్టుకు మేలు చేసినప్పటికీ, ముఖ్యంగా పొడిబారిన, నిర్జలీకరణానికి గురైన జుట్టుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇవి జుట్టు మృదుత్వాన్ని, దువ్వుకునే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

 

(చదవండి: చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement