వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్‌ ఆమోదం! | DoT may clear Vodafone-Idea merger today | Sakshi
Sakshi News home page

వొడాఫోన్, ఐడియా విలీనానికి నేడు డాట్‌ ఆమోదం!

Jun 18 2018 1:54 AM | Updated on Jun 18 2018 1:54 AM

DoT may clear Vodafone-Idea merger today - Sakshi

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ల విలీనానికి టెలికం శాఖ (డాట్‌) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్‌ జారీ చేయడం జరుగుతుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. అవసరమైన బ్యాంకు గ్యారంటీలను ఐడియా సమర్పించడంతోపాటు వొడాఫోన్‌ ఇండియా రుణాల చెల్లింపుల బాధ్యత తలెత్తితే తాను తీసుకునేందుకు హామీ ఇవ్వడంతో వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి పేర్కొన్నారు.

వొడాఫోన్‌ ఇండియా, ఐడియా కలసి విలీనం ద్వారా వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడనున్నాయి. దాంతో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంటుంది. జియో ప్రవేశం తర్వాత మార్కెట్లో మనుగడ కష్టంగా మారడంతో ఈ రెండు సంస్థలు కలసి ఒక్కటవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement