వీటిల్లో కొంటే అంతే! | Sakshi
Sakshi News home page

వీటిల్లో కొంటే అంతే!

Published Fri, Feb 17 2017 11:19 PM

వీటిల్లో కొంటే అంతే!

ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో కొనుగోలు చేయొద్దు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి రోజు ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో, బఫర్‌ జోన్‌లోనో, ఎఫ్‌టీఎల్‌లోనో అపార్ట్‌మెంట్‌ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ఫ్లాట్‌ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్‌ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు.

బఫర్‌ జోన్‌ అంటే: బఫర్‌ జోన్‌ అంటే నీటి పరీవాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్‌ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్‌ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా.

ఎఫ్‌టీఎల్‌ అంటే: ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతంను ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్‌ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి «ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (ఎంఆర్‌ఓ), జీహెచ్‌ఎంసీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కులు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement