సీఎం లాకర్ | CM locker | Sakshi
Sakshi News home page

సీఎం లాకర్

May 9 2016 3:01 AM | Updated on Sep 3 2017 11:41 PM

సీఎం లాకర్

సీఎం లాకర్

నడుస్తున్నది స్మార్ట్‌ఫోన్ల యుగం. దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి స్మార్ట్‌ఫోన్ ఉంటుంది.

Appకీ కహానీ...
నడుస్తున్నది స్మార్ట్‌ఫోన్ల యుగం. దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి స్మార్ట్‌ఫోన్  ఉంటుంది. మొబైల్ ఫోన్లు ఊరికే రావుకదా? అలాంటిది.. వేలు వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్ చేజారిపోతే. ఎవరైనా దొంగిలిస్తే. అప్పుడేంటి పరిస్థితి? మన సొమ్ముతో సహా విలువైన సమాచారాన్ని వదులుకోవాలి. ఇలాంటి స్థితి నుంచి తప్పించుకోవడానికి.. స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఎవరు తీశారో తెలుసుకోవడానికి ‘సీఎం లాకర్’ అనే యాప్ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
ప్రత్యేకతలు
* స్మార్ట్‌ఫోన్ లాకర్‌గా పనిచేస్తుంది. చాలా లేఔట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిల్లో మనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యాప్స్‌కు కూడా లాక్ సెట్ చేసుకోవచ్చు.
* బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తోన్న యాప్స్‌ను క్లీన్ చేసి, బ్యాటరీని ఆదా చేస్తుంది. ఫోన్ బూస్టర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
* ఎవరైనా మన స్మార్ట్‌ఫోన్‌ను మనకు తెలియకుండా ఓపెన్ చేస్తే.. వారి ఫొటోలు(ఫ్రంట్ కెమెరా ద్వారా) మన ఈ-మెయిల్ కు వస్తాయి. ఇక్కడ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వారి ఫొటో మనకు ఈ-మెయిల్ వస్తుంది. లేకపోతే రాదు. సాధారణంగా మనకు మాత్రమే పాస్‌వర్డ్ తెలుస్తుంది. ఇతరులకు తెలియదు. కాబట్టి వారు కచ్చితంగా తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి దొరికిపోతారు.
* మొబైల్‌కు వచ్చిన నోటిఫికేషన్లను డిస్‌ప్లే చేస్తుంది. కంటెంట్ డిస్‌ప్లే వద్దనుకుంటే.. ఆ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
* మ్యూజిక్, కెమెరా, ఫ్లాష్‌లైట్, బ్రైట్‌నెస్, బ్లూటూత్, కాలిక్యులేటర్ వంటివి టూల్‌బాక్స్‌లో ఉంటాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement