సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం? | Cipla likely to acquire Hetero Drugs | Sakshi
Sakshi News home page

సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?

Sep 4 2015 12:34 AM | Updated on Sep 3 2017 8:41 AM

సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?

సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?

ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. ఏపీఐ, ఫినిష్డ్ డోసేజెస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హెటిరోకు చెందిన అమెరికా వ్యాపారాన్ని ఫార్మా సంస్థ సిప్లా కొనుగోలు చేస్తోందని సమాచారం. వార్తా సంస్థ సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం హెటిరో యూఎస్ వ్యాపారం కాంబర్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో జరుగుతోంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న జనరిక్ కంపెనీల్లో ఇది ఒకటి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఓరల్ సొల్యూషన్స్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని రూ.3,250-3,575 కోట్లు వెచ్చించి సిప్లా దక్కించుకుంటోంది. డీల్‌లో భాగంగా కాంబర్‌కు చెందిన తయారీ యూనిట్లు కూడా సిప్లా పరం కాబోతున్నాయి. కాంబర్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా హెటిరోకు ఏటా రూ.1,625 కోట్ల ఆదాయం వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement