హెల్త్‌కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’! | India Healthcare, pharma sector to create 2-2. 5 million new jobs by 2030 | Sakshi
Sakshi News home page

హెల్త్‌కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’!

Apr 7 2026 5:20 AM | Updated on Apr 7 2026 6:33 AM

India Healthcare, pharma sector to create 2-2. 5 million new jobs by 2030

2030 నాటికి 25 లక్షల కొత్త కొలువులు

జీడీపీలో 5 శాతానికి పెరగనున్న వాటా 

అడెకో ఇండియా నివేదిక

ముంబై: ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్‌), ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో 2030 నాటికి కొత్తగా 20–25 లక్షల ఉద్యోగాలు రానున్నట్టు అడెకో ఇండియా నివేదిక అంచనా వేసింది. 30–35% సిబ్బందికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ అవసరం పడుతుందని తెలిపింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలు సామర్థ్య ఆధారిత వృద్ధి దశలోకి అడుగుపెట్టాయని పేర్కొంది. 

ఆస్పత్రులు, ఆయుష్, హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, డయాగ్నొస్టిక్స్, టెలి మెడిసిన్, క్లినికల్‌ పరిశోధన, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న ఈ రంగం వాటాకు అనుగుణంగా ఈ వృద్ధి ముడిపడి ఉన్నట్టు తెలిపింది. 

2022 నాటికి జీడీపీలో హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌ వాటా 3.3%గా ఉంటే.. 2030 నాటికి 5 శాతానికి విస్తరించనున్నట్టు అడెకో నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా క్లినికల్‌ పరిశోధనలు, డిజిటల్‌ హెల్త్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల అవుట్‌సోర్స్‌కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పెరు గుతుండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది.  

ఇక్కడ డిమాండ్‌ ఎక్కువ.. 
డయాగ్నొస్టిక్స్, వ్యాధి నిరోధక ముందస్తు చెకప్‌లు, టెలిమెడిసిన్‌ విభాగాల్లో 20–25% మేర ఉపాధి అవకాశాలు పెరగనున్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా టైర్‌–2, 3 పట్టణాల నుంచి ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. అలాగే, కాంప్లెక్స్‌ జనరిక్స్, బయోలాజిక్స్, స్పెషాలిటీ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), నియంత్రణ పరమైన విభాగాల్లోనూ ఉద్యోగాలకు 25–30% మేర డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనే ఉన్నప్పటికీ.. పుణే, అహ్మదాబాద్, కోయంబత్తూరు వంటి టైర్‌–2, 3 నగరాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో ఆస్పత్రుల నెట్‌వర్క్‌ విస్తరణను ప్రస్తావించింది. విదేశాల్లో భారతీయ ఆరోగ్య రంగ నిపుణులకు డిమాండ్‌ 25–30% పెరగనుందని, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, యూకే వంటి ప్రాంతాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement