ఐసీఐసీఐపై కౌంటర్‌ వేయనున్న చందా కొచర్‌

Chanda Kocchar Moves To High Court Against ICICI Bank - Sakshi

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందా కొచర్‌  తనను సీఈవోగా తొలగించడాన్ని సవాల్‌  చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు 2009 నుంచి 2019 వరకు పొందిన బోనస్‌లను తిరిగి ఇచ్చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్‌  బోర్డు నిర్ణయంపై  ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రంజిత్‌, జస్టిస్‌ కార్నిక్‌తో కూడిన దర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు హేతుబద్దమైన ఆధారాలు, ఆర్‌బీఐ అనుమతి లేకుండా తనను తొలగించడంపైనే ఆమె పిటిషన్‌లోని ముఖ్య అంశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చందాకొచర్‌ తరుపున విక్రమ్‌ నన్‌కాని, సుజయ్‌ కంతవాలా వాదనలు వినిపిస్తుండగా ఐసీసీఐ బ్యాంక్‌ తరపున డారియస్‌ కమ్‌బాటా వినిపించనున్నారు.

కాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న చందాకొచర్‌పై వీడియోకాన్‌ రుణాలకు సంబంధించిన క్రిడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై  కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ  చందా కొచర్‌, భర్త దీపక్‌ కొచర్‌తో  పాటు ఇతర బంధువులను కూడా చార్జ్‌ షీటు చేర్చింది.  అయితే ప్రారంభంలో చందా కొచర్‌ను వెనకేసుకొచ్చిన  బోర్డు, ఆరోపణలపై విచారణకు నియమించిన మాజీ న్యాయమూర్తి బీఎన్‌ కృష్ణ ఆధ్వర్యంలోని స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక అనంతరం ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top