కంపెనీలకు మందగమనం కష్టాలు

Care Rating Report on Companies Loss - Sakshi

భారీగా తగ్గినఆదాయాలు, లాభాలు  

కేర్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడి

ముంబై: ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం కంపెనీలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఈ మందగమనం కారణంగా ఈ జూన్‌ క్వార్టర్‌లో పలు కంపెనీల ఆదాయాలు, లాభా ల వృద్ధి భారీగా తగ్గాయని కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక పేర్కొంది. మొత్తం 2,976 కంపెనీల ఆర్థిక ఫలితాలను విశ్లేషించి కేర్‌ రేటింగ్స్‌ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.

ఈ నివేదిక ఏం చెప్పిందంటే..
భారత కంపెనీల నికర అమ్మకాల వృద్ది ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 4.6 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఇది 13.5 శాతంగా ఉంది.  
గత క్యూ1లో 24.6 శాతంగా ఉన్న నికర లాభ వృద్ధి క్యూ1లో 6.6 శాతానికి తగ్గింది.
బలహీనంగా, అంతంతమాత్రంగానే ఉన్న ఈ క్యూ1 ఫలితాలు.. ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల పరిశ్రమలు మందగమనంలోకి జారిపోయాయని సూచిస్తున్నాయి.  
ఇంత తీవ్ర స్థాయి ఇబ్బందుల్లోనూ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. సంఘటిత రంగంలోని ఉద్యోగాలపై మందగమన ప్రభావం పెద్దగా లేదు. ఈ రంగ ఉద్యోగుల వ్యయాల వృద్ధి నిలకడగానే కొనసాగుతోంది. కొన్ని రంగాల్లో ఉద్యోగాల వేతనాలు 11 శాతం మేర పెరిగాయి కూడా.
మార్చి క్వార్టర్‌లో వృద్ధి ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి పడిపోయింది.జూన్‌ క్వార్టర్‌లో మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.  
గత క్యూ1లో రెండంకెల వృద్ధి సాధించిన నిర్వహణ లాభ వృద్ధి ఈ క్యూ1లో 4.1 శాతానికి పడిపోయింది. నిర్వహణ లాభ మార్జిన్‌ మాత్రం నిలకడగా 20 శాతం స్థాయిలో ఉంది.  
గత క్యూ1లో 53% వృద్ధి సాధించిన నికర లాభం ఈ క్యూ1లో 12 శాతానికి తగ్గింది.  
బ్యాంక్‌లు, ఆర్థిక కంపెనీలు మినహా ఇతర కంపెనీల పన్ను చెల్లింపులు 19% తగ్గింది. గత క్యూ1లో ఇది 52% వృద్ది చెందింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top