భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

ByteDance planning to invest $1 bn in India - Sakshi

టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించినప్పటికీ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్‌ డైరెక్టర్‌ (ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ పాలసీ) హెలినా లెర్‌‡్ష వెల్లడించారు. స్వల్ప నిడివి వీడియోలను షేర్‌ చేసుకునేందుకు ఉపయోగపడే టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా అశ్లీల వీడియోలు కూడా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో దీన్ని నిషేధించడం తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్‌ సంస్థలు టిక్‌టాక్‌ను తమ యాప్‌ స్టోర్స్‌ నుంచి తొలగించాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top