
బీఎండబ్ల్యూ కొత్త ‘మినీ కంట్రీమ్యాన్’
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ప్రీమియం కాంపాక్ట్ కారు ‘మినీ కంట్రీమ్యాన్’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ప్రీమియం కాంపాక్ట్ కారు ‘మినీ కంట్రీమ్యాన్’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 36 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ). ఈ లగ్జరీ కాంపాక్ట్ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ర న్-ఫ్లాట్ ఇండికేటర్ వంటి త దితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్లు బుధవారం నుంచి కంప్లీట్లీ బిల్ట్-అప్ (సీబీయూ) రూపంలో మినీ డీలర్‌షిప్స్ వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. 2012లో ప్రారంభమైన మినీ మోడల్‌లో ప్రస్తుతం మినీ-3 డోర్, మినీ-5 డోర్, మినీ కన్వర్టబుల్, మినీ కంట్రీమ్యాన్ అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి.