భారత్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ | BlackBerry gets a Passport for redemption, at Rs 49990 | Sakshi
Sakshi News home page

భారత్ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్

Sep 30 2014 12:52 AM | Updated on Sep 2 2017 2:07 PM

బ్లాక్‌బెర్రీ కంపెనీ తన అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్’ను సోమవారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ తన అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్’ను సోమవారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల 10 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,990 అని బ్లాక్‌బెర్రీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సునిల్ లాల్వాణి చెప్పారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లోనూ, బ్లాక్‌బెర్రీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లోనూ ముందస్తు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.5,000 గిఫ్ట్‌కార్డ్ లభిస్తుందని వివరించారు

 3 వరుసల క్వెర్టీ కీ ప్యాడ్
 ఈ ఫోన్‌లో 4.5 అంగుళాల ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ ఉంది. మూడు వరుసల క్వెర్టీ కీ ప్యాడ్, కెపాసిటివ్ టచ్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ కీప్యాడ్ టైపింగ్‌కు, వేళ్లతో తాకడం ద్వారా నావిగేషన్‌కు ఉపయోగపడుతుందని వివరించారు.

 ఈ ఫోన్‌లో 3,450 ఎంఏహెచ్  బ్యాటరీ (తొలగించటానికి వీలులేని)ఉందని, 2జీ నెట్‌వర్క్‌లో 14 గంటల టాక్‌టైమ్‌ను సపోర్ట్ చేస్తుందని, 11 గంటల వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ చతురస్రాకార మొబైల్‌లో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఇంటర్న ల్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌టర్నల్ మెమరీ వంటి ప్రత్యేకలున్నాయని చెప్పారు. అత్యుత్తమ నాణ్యత గల విడిభాగాలు, స్పెసిఫికేషన్స్‌తో దీన్ని రూపొందించాన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement