బిట్‌ కాయిన్‌ దూకుడు..

Bitcoin just hit $10,000 - Sakshi

వర్చువల్‌ కరెన్సీ బిట్‌‌కాయిన్  పరుగులు పెడుతోంది. 2009లో ప్రవేశపెట్టినప్పుడు అమెరికా డాలర్‌లో కొన్ని సెంట్లు మాత్రమే  పలికిన ఈ డిజిటల్‌ బంగారం  తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం దీని విలువ  తొలిసారి  పదివేల డాలర్లకు చేరింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్రిప్టో   పదివేల డాలర్ల మార్క్‌ను అధిగమించిన  క్రిప్టోకరెన్సీ ఏడాదికాలంలో ఆల్ అసెట్ క్లాసెస్‌లో నంబర్  వన్‌ గా నిలిచింది. అంతేకాదు బిలియనీర్ హెడ్జ్ ఫండ్ లెజెండ్ మైక్ నోవోగ్రట్జ్ ప్రకారం బిట్కోయిన్ ధర 2018 నాటికి  40వేలడాలర్ల మార్కుకు చేరుతుంది.

డిజిటల్‌ కరెన్సీ మార్కెట్‌లో తొలిసారి 10,000 డాలర్ల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఆసియాలో 10,379 అమెరికా డాలర్లను తాకింది. ఈ ఏడాది ఆరంభ ధరతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికం. అంటే ఒక బిట్‌కాయిన్‌ విలువ భారత కరెన్సీ  ప్రకారం దాదాపు రూ.6 లక్షలు. లక్సెంబర్గ్‌కి చెందిన బిట్‌స్టాంప్‌లాంటి మేజర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇంకా పదివేల డాలర్లకి చేరలేదు కానీ..స్మాల్ ట్రేడింగ్ ప్లాట్‌పామ్స్‌పై ఎక్సేంజ్‌ వాల్యూ పదివేల డాలర్లపైనే ట్రేడ్‌ కావడం విశేషం.

‘డిజిటల్‌ బంగారం’గా భావించే బిట్‌కాయిన్‌ను ఎన్‌క్రిప్షన్‌, బ్లాక్‌చెయిన్‌ డేటాబేస్‌ ఆధారంగా వినియోగిస్తారు. రహస్య పెట్టుబడిదారులు, ఇతరుల నుంచి గిరాకీ ఉండటంతో అతి తక్కువ కాలంలోనే 2000, 5000, 7500, 10000 డాలర్ల స్థాయిల్ని సులభంగా దాటేసిందని ఎనలిస్టులు అంచనావేశారు. .అయితే ఈ స్థాయిలో అప్రమత్తంగాఉండాలని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top