‘బిగ్‌ సి’ దసరావళి ఆఫర్లు | Big c festival offers | Sakshi
Sakshi News home page

‘బిగ్‌ సి’ దసరావళి ఆఫర్లు

Oct 9 2018 12:47 AM | Updated on Oct 9 2018 12:47 AM

Big c festival offers - Sakshi

మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ తమిళనాడులో ఎంట్రీ ఇచ్చింది. మధురైలో ఏర్పాటు చేసిన తొలి ఔట్‌లెట్‌ను సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటి సమంత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దసరావళి ఆఫర్లను ఆవిష్కరించారు. ఆరు వారాలపాటు సాగే ఈ ఆఫర్‌లో లక్కీ డ్రా ద్వారా మొత్తం 252 మంది కస్టమర్లకు 42 హ్యూందాయ్‌ ఇయాన్‌ కార్లు, 42 ప్లాటినా బైక్‌లు, 42 ఎల్‌ఈడీ టీవీలు, 42 రిఫ్రిజిరేటర్లు, 42 వాషింగ్‌ మెషీన్లు, 42 ల్యాప్‌టాప్‌లను బహుమతిగా అందజేస్తామని బిగ్‌ సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు.

శాంసంగ్‌ నోట్‌ 7పై రూ.6,000 పేటీఎం క్యాష్‌బ్యాక్, వివో వి11 ప్రో, ఒప్పో ఎఫ్‌9 ప్రో మొబైల్‌పై రూ.5,999 విలువగల ట్రాలీ సూట్‌కేస్, హానర్‌ 7సీ మొబైల్‌పై రూ.1,499 విలువైన బ్లూటూత్‌ ఉచితం వంటి ఆఫర్లున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి, కైలాష్‌ లఖ్యానీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement