భీమ్‌ యాప్‌: మరోసారి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

BHIM App to Give Cashback Offers From April 14 to Mark Birth Anniversary of Dr. B R Ambedkar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్  జయంతి  సందర్భంగా  కేంద్ర  ప్రభుత్వం బంపర్‌ ఆఫర్లు అందించనుంది. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్‌ చేసిన ప్రభుత్వ యాప్‌  భీమ్‌  లావాదేవీలపై  క్యాష్‌బ్యాక్‌ అఫర్లను  అందిస్తోంది. ముఖ్యంగా ​గూగుల్ తేజ్, ఫ్లిప్‌కార్ట్‌  ఫోన్ పే  మార్కెటింగ్ వ్యూహాలను  ఫాలో అవుతూ ఇపుడు భీమ్‌ యాప్‌ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది.  గతేడాది ఆగస్టులో భీమ్‌ లావాదేవీలు 40.5 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2016 డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్‌ యాప్‌ ద్వారా అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14నుంచి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అమలు  చేయనుంది. సుమారు  రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను  అందించాలని నిర్ణయించింది. ఫోన్‌పే, తేజ్‌, పేటీఎం నమూనాలను పరిశీలించాం. క్యాష్‌బ్యాక్‌, ప్రోత్సాహకాలు ప్రకటించినప్పుడల్లా లావాదేవీలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇదొక ప్రవర్తనా మార్పు’ అని దీనిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  నోట్ల రద్దు  తరువాత డిజిటల్‌  లావాదేవీలపై  దృష్టిపెట్టిన  కేంద్రం  గూగుల్‌ తేజ్‌, ఫోన్‌పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్‌  యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు  గణనీయంగా(సింగిల్‌ డిజిట్‌కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు  వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు  అందించే అవకాశాన్ని కల్పిస్తోంది.

క్యాష్‌బ్యాక్‌  ఆఫర్లు
భీమ్‌ యాప్‌ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్‌ బ్యాక్‌  లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష‍్టంగా రూ.750  క్యాష్‌ బ్యాక్‌ అందిస్తుంది.  అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు.  మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.

కాగా భీమ్‌ యాప్‌ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను  లాంచ్‌ చేసింది. భీమ్‌ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్‌ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను  ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top