సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్‌ | Axis Bank cuts savings account interest rate by 50 bps | Sakshi
Sakshi News home page

సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్‌

Aug 9 2017 12:48 AM | Updated on Sep 17 2017 5:19 PM

సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్‌

సేవింగ్స్‌పై వడ్డీ అరశాతం కోత: యాక్సిస్‌

ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్‌ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది.

ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్‌ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5 శాతం వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథాప్రకారం 4 శాతంగానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. రూ. 1 కోటి కన్నా తక్కువగా డిపాజిట్లున్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కర్ణాటక బ్యాంకులు కూడా సేవింగ్స్‌ అకౌంట్లపై రేటును తగ్గించాయి.

Advertisement
 
Advertisement
Advertisement