భారత్‌లోకి ‘ఆపిల్‌’..!

Apple to Expand Manufacturing Base in India - Sakshi

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దిగ్గజ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు భారత మార్కెట్‌ పట్ల ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్‌.. అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు భారత్‌ ఎగుమతుల హబ్‌గా మారనుందన్నారు. ఇక తమ హయాంలోనే భారత్‌లోని మొబైల్‌ ఫ్యాక్టరీలు రెండు నుంచి 268కి చేరాయని చెప్పారు. మన దేశంలో బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్‌ సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  

ఫండ్స్‌ పెట్టుబడుల్లో చిన్న పట్టణాల హవా
న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ చిన్న పట్టణాల్లోని ఇన్వెస్టర్లనూ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.  ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు ఆగస్ట్‌ చివరికి రూ.25.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం జూలై చివరికి ఉన్న రూ.24.53 లక్షల కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. దేశంలోని టాప్‌ 30 పట్టణాలు కాకుండా.. ఇతర పట్టణాల (బియాండ్‌ 30) నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా మొత్తం రూ.25.64 లక్ష కోట్లలో 15.3 శాతంగా ఉన్నట్టు ‘యాంఫి’ డేటా తెలియజేస్తోంది. జూలై చివరికి ఉన్న 14.48 శాతం నుంచి సుమారు ఒక్క నెలలోనే ఒక శాతం పెరిగింది. చిన్న పట్టణాలకూ విస్తరించే దిశగా సెబీ గత కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్న ఒత్తిడి ఫలితాలనిస్తోంది.  ఫండ్స్‌ పెట్టుబడి ఆస్తుల్లో అత్యధికంగా 41.80 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.  వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 52.60 శాతంగా ఉంటే, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల వాటా 47.40 శాతంగా ఉంది.

ఫండ్స్‌ పెట్టుబడులు చౌక: మార్నింగ్‌ స్టార్‌  
కాగా, సెబీ తీసుకున్న చర్యలతో ఫండ్స్‌లో పెట్టుబడులు చౌకగా మారినట్టు మార్నింగ్‌స్టార్‌ నివేదిక పేర్కొంది. అప్‌ఫ్రంట్‌ కమీషన్లపై నిషేధం, ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే వ్యయ చార్జీలపై  పరిమితులు వంటి అంశాలను ప్రస్తావించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top