
ఆపిల్ వాచ్ (ఫైల్ ఫోటో)
శాన్ ఫ్రాన్సిస్కో: ఆపిల్ యూజర్లు మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూజర్లకు సంబంధంలేకుండానే ఎమర్జన్సీ ఎస్‌ఓఎస్ మెసేజ్‌లో డెలివరీ అవుతున్నాయట. ఆపిల్ డివైస్‌లు అనుకోకుండా అత్యవసర మెసేజ్‌లను పంపడం తాజాగా కలకలం రేపింది. అనుకోకుండా ఆపిల్ వాచ్‌లు అత్యవసర సందేశాలను పంపుతున్నాయని కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన ఉదంతాలపై ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
జాసన్ రోలే అనే వినియోగదారుడు ట్వీట్ ప్రకారం ఆయన ఆపిల్‌వాచ్ బటన్ ప్రెస్ కావడంతో పోలీసులకు అత్యవసర మెసేజ్ వెళ్లింది. దీంతో పోలీసులు అర్థరాత్రి పరుగెత్తుకు వచ్చారు. ఇలాంటి అ నేక సంఘటనల గురించి ఆపిల్ వినియోగదారులు ట్విట్టర్ లో రిపోర్ట్ చేశారు. ఎస్‌ఓఎస్ అలర్ట్‌తో తమ బంధువులు ఆందోళనలో మునిగిపోయారని మరికొంతమంది వాపోయారు. జార్జ్ ఎడ్మండ్స్ అనే వినియోగదారుడు మైక్రో-బ్లాగింగ్ సైట్లో ఇలా వ్రాశాడు: "గత రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లాను.. నిద్రపోయాను. నా ఫోన్లో అత్యవసర బన్ ప్రెస్ అయింది. దీంతో నిద్రనుంచి లేసి చూసేసరికి సోదరివి బోలెడు మిస్ కాల్స్. నా కేదో అయిపోయిందని భయపడిపోయింది’’. అంతేకాదు ఇలాంటి సమస్యే ఐఫోన్‌లలో కూడా ఉత్పన్నం కావచ్చని ది వెర్జ్ నివేదించింది.
ఎస్ఓఎస్ అలర్ట్ బటన్: యూజర్లు క్లిష్టమైన లేదా అత్యసవరమైన సహాయం అవసరమైన సమయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. పోలీసులు, బంధువులు సహా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులకు కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం. బాధితులు, ఫిర్యాదుదారుల లొకేషన్ ఇండికేషన్ ఆధారంగా ఆటోమేటెడ్‌గా మెసేజ్‌లను పంపుతుంది.