అనుష‍్క శర్మ కొత్త కారు: ధర వింటే | Anushka Sharma owned new car | Sakshi
Sakshi News home page

అనుష‍్క శర్మ కొత్త కారు: ధర వింటే

Nov 21 2018 4:40 PM | Updated on Nov 21 2018 5:46 PM

Anushka Sharma owned new car - Sakshi

సాక్షి, ముంబై:  వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్‌  హీరోయిన్‌ అనుష్క శర్మ  కొత్త లగ్జరీకారును  సొంతం  చేసుకున్నారట. అతి విలాసవంతమైన  రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ (లాంగ్‌వీల్‌ బేస్‌)  కారును ఖరీదు చేసినట్టు తెలుస్తోంది.  ఈ అల్టిమేట్‌ లగ్జరీ ఎస్‌యూవీ ధర సుమారు. 4కోట్ల రూపాయలు.  సూయి ధాగా, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లోని నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అనుష్క.  

మరోవైపు  బాలీవుడ్ సూపర్‌ స్టార్‌  షారూక్‌ ఖాన్‌తో జతగా నటిస్తున్న  ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో జీరో  సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది.  అనుష్క ఈ మూవీలో సైంటిస్టుగా ఒక చాలెంజింగ్‌ రోల్‌ లో కనిపించనున్నారు. కాగా ఇటీవల సింగపూర్‌లో మేడం టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియంలో తన మైనపు బొమ్మను అనుష్క ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement