పండుగ సీజన్‌కు అమెజాన్ గుడ్‌న్యూస్
పండుగ సీజన్‌కు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది.
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్‌కు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ సీజన్‌లో నిర్వహించబోయే సేల్స్‌కు అనుగుణంగా.. భారీగా ఉద్యోగవకాశాలు కల్పించాలని అమెజాన్ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లో 22వేల సీజనల్ ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. తమ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సర్వీసు సైట్లలో ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నామని ఈ ఈ-కామర్స్ దిగ్గజం చెప్పింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌తో పాటు దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ ఉద్యోగవకాశాలు కల్పించనుంది.
తమ వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి తమ సామర్థ్యం మేరకు ఈ 22వేలకు పైగా సీజనల్ అసోసియేట్స్ సాయపడతారని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా అకిల్ సక్సేనా చెప్పారు. ముఖ్యంగా వీరిని పండుగ సీజన్ కోసం నియమించుకోనున్నట్టు చెప్పారు. అమెజాన్ 41 ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, 15 సోర్టేషన్ సెంటర్లు, 150 డెలివరీ స్టేషన్లలో ఈ అసోసియేట్లు జాయిన్ అవుతారని, వీరు సరుకులను పిక్ చేసుకుని, ప్యాకే చేసి, రవాణా చేసి, కస్టమర్లకు డెలివరీ చేస్తారన్నారు.