భారత్లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ | Amazon India starts Prime services for delivery | Sakshi
Sakshi News home page

భారత్లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’

Jul 27 2016 1:23 AM | Updated on Aug 1 2018 3:40 PM

భారత్లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ - Sakshi

భారత్లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’

1, 2 రోజుల్లోనే వస్తువుల కచ్చిత డెలివరీ

 న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్‌ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్‌పై ప్రైమ్ లోగో కనిపిస్తుంది.

ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సేవలకు మినిమమ్ ఆర్డర్ అంటూ ఎలాంటి షరతులు ఉండవు. అలాగే ప్రైమ్ సభ్యులు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు సహా పలు ఎక్స్‌క్లూజివ్ డీల్స్ వివరాలను ఇతరుల కన్నా ముందే (30 నిమిషాలు) తెలుసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు 1,2 రోజుల డెలివరీతోపాటు స్వల్ప అదనపు చార్జీలతో (ఆర్డర్‌కు రూ.50లు) అదే రోజు, షెడ్యూల్ డెలివరీ వంటి సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఈ సేవలు హైదరాబాద్, బెంగళూరు వంటి 20 పట్టణాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా అమెజాన్ ప్రైమ్ సర్వీసులు.. ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్’ సేవలకు గట్టి పోటీనివ్వనున్నది.

 ప్రైమ్ సేవలు 60 రోజలు ఉచితం
ఇండియన్ ఆన్‌లైన్ షాపర్స్ తాజా ప్రైమ్ సేవలను ట్రయల్ బేసిస్ పైన 60 రోజులు వరకు ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. తర్వాత ప్రైమ్ సేవలను అలాగే పొందాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని పేర్కొంది. దీని ధర రూ.499 (వార్షిక ఫీజు)గా నిర్ణయించామని తెలిపింది. త్వరలో ప్రైమ్ వీడియో సర్వీసులను కూడా దేశంలో ప్రారంభిస్తామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement