
సాక్షి, ముంబై: పండుగ ఎదైనా, సందర్భం ఏదైనా ఈ కామర్స్ సైట్లు, తయరా సంస్థలు ఆఫర్లతో కస్టమర్లను కట్టిపడేస్తాయి. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఆఫర్ల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు కార్నివల్ సేల్‌ను ప్రారంభించింది. తొమ్మిది రకాల వివో స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ద్వారా డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా వివో వి7 ప్లస్, వివో వి7, వివో వి5 ప్లస్, వివో వి5 ఎస్, వివో వై69, వివో వై66, వివో వై55 ఎస్, వివో వై53 స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై డిస్కౌంట్లు అందించనున్నట్లు వివో ప్రకటించింది
ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ తీసుకొచ్చి మనీష్ మల్హోత్రా వివో వి7 ప్లస్‌పై స్పెషల్ డిజైన్‌తో ప్రేమికులను ఆకట్టుకునేలా లాంచ్ చేసింది సంగతి తెలిసిందే. దీనిపై రూ.500 విలువచేసే బుక్ మై షో , ఫెర్న్స్ అండ్ పెటల్స్ కూపన్లు, ఎక్సేంజ్ ద్వారా రూ.3వేల దాకా తగ్గింపు. ఈ స్పెషల్ డివైస్ రూ.22,990కు లభించనుంది.
అలాగే రెండువేల రూపాయల తగ్గింపుతో వివో వి7 16,990కే లభించనుంది. రూ. 25,990గా ఉన్న 6వేల డిస్కౌంట్‌తో వివో వి5 ప్లస్ ఈ కార్నివల్‌లో రూ. 19,990కే లభ్యం. వివో వి5 ఎస్‌పై రూ.3 వేల డిస్కౌంట్‌తో రూ.15,990కే లభిస్తోంది. వివో వై సిరీస్‌లో ఉన్న వై69, వై55 ఎస్, వై53లపై రూ. 1000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా. నిబంధనలకు లోబడి ఎక్సేంజ్ ఆఫర్‌తో వి5 ప్లస్‌పై రూ. 3 వేలు, వి5 ఎస్, వై69పై రూ.2,500, వి7, వి7 ప్లస్‌పై రూ. 2 వేలు, వై55 ఎస్, వై 53పై రూ. 1,500, వై66పై రూ.4వేల డిస్కౌంటును వివో అందిస్తోంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాల్సిందే.