టాప్‌గేర్‌లో ‘ఆల్టో’...

Alto best selling PV model in Feb - Sakshi

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ‘ఆల్టో’ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెస్ట్‌ సెల్లింగ్‌ ప్యాసింజర్‌ వాహనం(పీవీ)గా ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌(సియామ్‌)విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదేకాలంలో కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిలవగా.. ఈసారి ఆస్థానానికి ఆల్టో దూసుకొచ్చింది.

డిజైర్‌ 15,915 యూనిట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 18,224 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్‌ రెండో స్థానానికి, 17,944 యూనిట్ల అమ్మకాలతో బాలెనో మూడో స్థానానికి చేరాయి. వ్యాగన్‌ఆర్‌ 15,661 యూనిట్లతో 5వ స్థానంలో నిలిచింది. విటారా బ్రెజా 11,613 యూనిట్ల అమ్మకాలతో 6వ స్థానానికి చేరింది. తొలి ఆరు స్థానాల్లో మారుతి సుజుకి వాహనాలే ఉండగా.. హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 ఏడవ స్థానంలోనూ, క్రెటా ఎనిమిదో స్థానంలో, గ్రాండ్‌ ఐ10 తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టాటా మోటార్స్‌ టియాగో 10వ స్థానానికి చేరుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top