అల్పాదాయ సబ్‌స్ర్కైబర్లకు ఎయిర్‌టెల్‌ ఆఫర్‌

Airtel Announces Measures To Shield Low Income Mobile Customers - Sakshi

ముంబై : కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అల్పాదాయ మొబైల్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ భారీ ఊరట కల్పించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో అల్పాదాయ మొబైల్‌ సబ్‌స్ర్కైబర్ల కోసం ఏప్రిల్‌ 17 వరకూ ఇన్‌కమింగ్‌ సేవలను కొనసాగించడంతో పాటు రూ 10 టాక్‌టైమ్‌ను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దినసరి కార్మికులు, వలస కూలీలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. 8 కోట్ల మంది ఈ తరహా కస్టమర్ల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ వ్యాలిడిటీని ఈనెల 17వరకూ పొడిగించనున్నట్టు వెల్లడించింది. వారి ప్లాన్‌ ముగిసినా తమ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెంబర్లకు వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను వారు రిసీవ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు రూ 10 టాక్‌టైమ్‌ను అదనంగా వర్తింపచేస్తామని, దీంతో వారు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో మాట్లాడేందుకు, ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు వెసులుబాటు కలుగుతందని తెలిపింది. మరో 48 గంటల్లో ఈ వెసులుబాటు తమ సబ్‌స్ర్కైబర్లకు అందుబాటులోకి వస్తుందని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

చదవండి : మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top