
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ రూట్లలో కేవలం రూ.999 లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. జనవరి 21 నుంచి 31 వరకు జరిగే ఒకవైపు ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుండగా.. ఇందుకు సంబంధించిన బుకింగ్స్‌ను జనవరి 7 నుంచి 20 వరకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
మొత్తం 19 గమ్యస్థానాలకు డిస్కౌంట్ అమల్లో ఉంది. ఈ జాబితాలో బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, గౌహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, చెన్నైలు ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ రూట్లలో రూ.2,999లకే ప్రారంభ ధరను నిర్ణయించింది. కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్ ప్రకటించింది.