ఎయిర్ షోలో యూకే బృందంతో విన్యాసాలు.. | air Show UK to perform with the band .. | Sakshi
Sakshi News home page

ఎయిర్ షోలో యూకే బృందంతో విన్యాసాలు..

Mar 11 2014 1:02 AM | Updated on Sep 2 2017 4:33 AM

ఎయిర్ షోలో యూకే బృందంతో విన్యాసాలు..

ఎయిర్ షోలో యూకే బృందంతో విన్యాసాలు..

ఏవియేషన్ షో టికెట్లను బుక్‌మైషో పోర్టల్, యాక్సిస్ బ్యాంకు కేంద్రాలు, అలాగే బేగంపేట విమానాశ్రయం వద్ద విక్రయిస్తామని ఫిక్కీ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంతీయ డెరైక్టర్ వివేక్ కొడికల్ చెప్పారు.

 ఏవియేషన్ షో టికెట్లను బుక్‌మైషో పోర్టల్, యాక్సిస్ బ్యాంకు కేంద్రాలు, అలాగే బేగంపేట విమానాశ్రయం వద్ద విక్రయిస్తామని ఫిక్కీ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంతీయ డెరైక్టర్ వివేక్ కొడికల్ చెప్పారు. వైమానిక విన్యాసాల్లో పేరున్న యూకేకు చెందిన మార్క్ జెఫరీస్, టామ్ క్యాజిల్స్ ప్రదర్శన ఈసారి హైలైట్‌గా నిలవనుంది. ఉదయం 11, మధ్యాహ్నం 3 గంటలకు వీరి విన్యాసాలు అయిదు రోజులపాటు ఉంటాయి. బిజినెస్ సందర్శకులకు 12-14 తేదీల్లో, సాధారణ ప్రజానీకానికి 15, 16న మాత్రమే అనుమతిస్తారు.
 
 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి 1, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రదర్శన ఉంటుంది. ప్రతి సెషన్‌కు 5,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. నిరాశ కలిగించే అంశమేమంటే ప్రపంచంలో అతిపెద్ద విమానమైన ఏ380 కేవలం బిజినెస్ విజిటర్లను మాత్రమే అలరించనుంది. 12-14 తేదీల్లో మాత్రమే దీనిని ప్రదర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement