ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

Published Wed, Mar 28 2018 5:11 PM

Air India Receives Bomb Threats Call For Delhi Kolkata Flight - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి కోల్‌కత్తా వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు ముప్పు ఉందంటూ విమానయాన సంస్థ కాల్‌ సెంటర్‌కు బెదిరింపు కాల్‌ వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానయాన సంస్థ అప్రమత్తమైంది. ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానాన్ని వెంటనే వెనక్కి రప్పించి, దించేశారు. ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. 

ఢిల్లీ నుంచి కోల్‌కత్తా వెళ్లే ఏ1-020 విమానానికి ఈ బాంబు ముప్పు ఉందంటూ కాల్‌ వచ్చిందని తెలిసింది. ముంబైలోని ఎయిరిండియా సదర్‌ల్యాండ్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌కు ఈ కాల్‌ ఇచ్చింది. వెంటనే ఆ విమానాన్ని ఐజీఐకి తరలించారు. ఆ విమానంలో 248 ప్రయాణికులు, 11 క్రూ సిబ్బంది ఉన్నాట్టు తెలిసింది. విమానంలో ప్రయాణికులను తన హ్యాండ్‌ లగేజీతోనే డీబోర్డు చేశారు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై ఫిర్యాదును ముంబై పోలీసులకు కూడా ఫార్వర్డ్‌ చేశారు.   

Advertisement
Advertisement