మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు | Air Costa to Start Flights to Madurai from Hyderabad, Chennai | Sakshi
Sakshi News home page

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

Jun 20 2014 12:58 AM | Updated on Sep 2 2017 9:04 AM

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తన సర్వీసులను మరో రెండు నగరాలకు విస్తరించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తన సర్వీసులను మరో రెండు నగరాలకు విస్తరించింది. తమిళనాడులోని మధురై, చెన్నైలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జూలై 3 నుంచి హైదరాబాద్, చెన్నైల నుంచి మధురైకి విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. అలాగే జూలై 4 నుంచి విజయవాడ నుంచి చెన్నైకి వయా హైదరాబాద్ మీదుగా కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. కొత్త సర్వీసులతో కలిపి తొమ్మిది పట్టణాల నుంచి  34 రోజువారీ సర్వీసులను నడుపుతున్నట్లు ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement