ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ జోరు! | Adomantra Cross Screen Platform for | Video Technology | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ జోరు!

Jan 3 2017 1:52 AM | Updated on Sep 5 2017 12:12 AM

ఈ కొత్త ఏడాది ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌దే అంటోంది యాడోమంత్ర డిజిటల్‌. ఈ సంస్థ ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.

న్యూఢిల్లీ: ఈ కొత్త ఏడాది ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌దే అంటోంది యాడోమంత్ర డిజిటల్‌. ఈ సంస్థ ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. హైస్పీడ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుదల వంటి పలు అంశాలు ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ జోరుకు దోహదపడతాయని తాజాగా తన నివేదికలో పేర్కొంది.

ఇక అడ్వర్టైజింగ్‌ జోరులో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి వాటితో వీడియో వీక్షణంతోపాటు వీడియో అడ్వర్టైజింగ్‌ కూడా పెరుగుతుందని వివరించింది. ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ విభాగపు ఆదాయం గతేడాది దాదాపు రెండు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఆన్‌లైన్‌ వీడియో అడ్వర్టైజింగ్‌ పరిశ్రమలో 2016లో 200 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement