పీఎఫ్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌‌‌.. భారీగా డేటా చోరీ

Aadhar Linked PF Portal Hacked - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఆధార్‌ అనుసంధానిత సైట్‌ aadhaar.epfoservices.comను హ్యాకర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. సమారు 2.7 కోట్ల మంది ఇందులో సభ్యులుగా ఉండగా.. వారి డేటా చోరీకి గురైనట్లు సమాచారం.

ఈ మేరకు సాంకేతిక సమాచార శాఖకు ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జోయ్‌ ఓ లేఖ రాశారు. డేటా చోరీకి గురైందని.. ప్రస్తుతం సైట్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు ఆయన తెలిపారు. టెక్నికల్‌ టీమ్‌ త్వరగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోపక్క నిఘా వ్యవస్థ గతంలోనే ఈపీఎఫ్‌వోకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలపై సైబర్‌ భద్రతా నిపుణులు ఆనంద్‌ వెంకట్‌ నారాయణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్లో ఆధార్‌ అనుసంధానం అయి ఉండటంతో జీతభత్యం, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర వివరాలను కూడా హ్యాకర్లు సులువుగా గుర్తించే వీలుండొచ్చని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

                        గతంలో ఐబీ విభాగం జారీ చేసిన హెచ్చరిక నోట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top