హ్యుందాయ్‌ క్రెటా @ రూ. 9.9 లక్షలు | 2020 Hyundai Creta launch today | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ క్రెటా @ రూ. 9.9 లక్షలు

Mar 17 2020 6:04 AM | Updated on Mar 17 2020 6:04 AM

2020 Hyundai Creta launch today - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తాజాగా తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘క్రెటా’ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన కారు ధరల శ్రేణి రూ. 9.9 లక్షలు – 17.2 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌ ఎస్‌ కిమ్‌ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలోని లోపాలను అధిగమించి, అత్యాధునిక వాహనాన్ని మార్కెట్లోకి తీసుకుని రావడం కోసం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొత్త మోడల్‌ అందుబాటులో ఉంచాం. ఇక మల్టీ–సీటర్‌ హై ఆక్యుపెన్సీ వెహికల్‌ తయారీలో పట్టు సాధించడంలో భాగంగా త్వరలోనే మల్టీ–పర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ)ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ అని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement