హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ | 2020 Honda WR V Facelift Launched In India | Sakshi
Sakshi News home page

హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్

Jul 2 2020 3:42 PM | Updated on Jul 2 2020 3:48 PM

2020 Honda WR V Facelift Launched In India - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆటో సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ మోడల్  2020  ఫేస్‌లిఫ్ట్  వెర్షన్  కారును  భారతదేశంలో  లాంచ్ చేసింది.  దీని ధరలు 8.50 లక్షల నుండి ప్రారంభమై 10.99 లక్షల రూపాయల వరకు (అన్ని ధరలు,ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించాలనుకున్నా కరోనావైరస్ మహమ్మారితో ఆలస్యమైందని జపాన్ కార్ మేకర్ వెల్లడించింది. రిఫ్రెష్ స్టైలింగ్, కొత్త ఫీచర్లతో బీఎస్-6 ఫార్మాట్లో అప్ డేట్ చేసింది.  పెట్రోలు, డీజిల్  ఇంజీన్లతో ఎస్ వీ, వీక్స్ అనే  రెండు వేరియంట్లలో మాత్రమే ఇది లభ్యం కానుంది. 

హోండా డబ్ల్యూఆర్-వీ డిజైన్, ఫీచర్లు
బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. డీజిల్ వెర్షన్ వాహనం 99 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

పెట్రోల్ వాహనమైతే 89 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  6- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ లాంటివి జోడించింది.

7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్,  డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ పార్కింగ్ సెన్సార్లు,  మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే..మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ లాంటివి ప్రధానంగా గట్టిపోటీ ఇవ్వనున్నాయి. 
 

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement